తూర్పు గోదావరి జిల్లా, కచ్చులూరు వద్ద జరిగిన ప్రమాదం వలన మునిగిపోయిన రాయల్ వశిష్ట పడవని బయటకు తీసినందుకు గాను ధర్మాది సత్యానికి, జిల్లా కలెక్టర్ ఘనంగా సన్మానించి రూ.20 లక్షల రూపాయలను అందజేశారు. కాగా ఈ విషయంలో అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు ధర్మాడీ సత్యం మరియు అతని బృందం. అయితే కచ్చలూరులో గోదావరి నదిలో మునిగిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు మంగళవారం నాడు బయటకు తీశారు. ఈ ప్రయత్నంలో ఎన్నో సార్లు విఫలమైనప్పటికీ కూడా, తన నమ్మకాన్ని మాత్రం కోల్పోకుండా, తన బృందం తో సహా తీవ్రంగా శ్రమించి చివరికి ఆ రాయల్ వశిష్ట పడవను బయటకు తీశారు. ఈమేరకు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి, ధర్మాడీ సత్యాన్ని ఘనంగా సన్మానించి రూ.20 లక్షలు చెక్కును అందజేశారు. కాగా వీరి ఒప్పందం ప్రకారం పని ప్రారంభించడానికి ముందే 2 లక్షలను అనుడుకున్న ఈ బృందం, నేడు మిగిలిన 20 లక్షల చెక్కును కూడా అందుకున్నారు. కాగా మొత్తం 22.7 లక్షలకు వీరు తమ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa