న్యూ ఢిల్లీ : కొత్త ఢిల్లీలో కొత్త పార్లమెంటు, సచివాలయ భవనాలు సాకారం కానున్నాయి. ఆధునిక బిల్డింగ్ టెక్నలాజితో, అత్యంత సుందరంగా ఈ భవనాలను నిర్మించడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ భవనాల నిర్మాణానికి బిడ్లు ఖరారు చేస్తూ సీపీడబ్ల్యూడీ నిర్ణయం తీసుకుంది. మూడు ఐకానిక్ నిర్మాణాలు కోసం ఏజెన్సీలు డిజైన్లు ఖరారు చేస్తాయి. ఈ డిజైన్లు భారత సంస్కృతీ సంప్రదాయాలకు అడ్డం పట్టేలా ఉంటాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ భవనాలు 250 ఏళ్ళ వరకు చెక్కుచెదరకుండా ఉంటాయి. 2022 నాటికి మూడు ఐకానిక్ భవనాల నిర్మాణం పూర్తి చేయాలని ప్రభత్వం సంకల్పించింది. పార్లమెంటు, సచివాలయం కాంప్లెక్సు నిర్మాణానికి 12,450 కోట్లు ఖర్చవుతాయని ప్రాథమిక అంచనా.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa