సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. ఈ భేటీలో జిల్లాల పునర్విభజనతో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ప్రపంచబ్యాంకు, ఏడీబీ నిధులతో అమరావతి క్యాపిటల్ సిటీ ప్యాకేజీ పనులకు, తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో స్టాంప్ డ్యూటీ మినహాయింపునకు, మంగళగిరి-తాడేపల్లి పరిధిలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, ఎన్టీపీ పనులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఉద్యోగుల డీఏ పెంపు అమలుకు ఆర్థికశాఖకు అనుమతి, గ్రామ, వార్డు సచివాలయాల పేర్ల మార్పుపై ఆర్డినెన్స్‌కు క్యాబినెట్ అంగీకారం తెలిపింది. మరికొన్ని అంశాలపై చర్చ కొనసాగుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa