ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని కృష్ణాజిల్లా మోపిదేవిలోని సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయాన్ని కుటుంబసమేతంగా సందర్శించుకున్నారు. ఈవో లీలాకుమార్ స్వామివారి చిత్రపటం, ప్రసాదాలను సీఎ్‌సకు అందించారు. ఆ తర్వాత ఆమె కృష్ణా సాగర సంగమ ప్రదేశాన్ని సందర్శించారు. అనంతరం సముద్రతీరంలో అటవీశాఖ అధికారులు ఏర్పాటుచేసిన చిత్రాలను పరిశీలించారు. హంసలదీవిలో రుక్మిణి, సత్యభామ సమేత వేణుగోపాలస్వామి వారిని ఆమె దర్శించుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa