ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ మంత్రం చదివితే కరోనా మీ దరికి చేరదు..

national |  Suryaa Desk  | Published : Thu, Jan 30, 2020, 04:16 PM

కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచమంతా భయపడుతోంది. ఇప్పటికే దీని బారిన పడి 132 మంది చైనీయులు మృతి చెందగా, వందలాది మంది దీనికి ప్రభావితమయ్యారు. అసలు ఇప్పటి వరకు ఈ వ్యాధిని గుర్తించేందుకు రాష్ట్రాల చెంతకు సరైన పరికరాలే అందుబాటులోకి రాలేదు. అయితే.. మందులు, సూదుల అవసరం లేకుండానే ఓ మంత్రాన్ని చదివి కరోనాను తరిమికొట్టవచ్చని అంటున్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త దలైలామా. వివరాల్లోకెళితే.. ఈ వైరస్ వ్యాప్తి చెందగానే పలువురు చైనా భక్తులు దీనికి విరుగుడు చెప్పాలని ఫేస్‌బుక్ ద్వారా దలైలామాను కోరారు. దీంతో వారి కోరిక మేరకు తారా మంత్రాన్ని పఠించాలని సూచించారు. దాన్న పఠిస్తే కరోనా దరికి చేరదని, దాన్ని విముక్తి పొందవచ్చని చెప్పారు. ఆ తారా మంత్రం ఏంటంటే.. ‘ఓం తారే తుత్తారే తూరే సోహా’. దీన్ని పఠించడం వల్ల మెదడు ప్రశాంతంగా, ఆందోళనలను దూరంగా ఉంచుతుందని వెల్లడించారాయన. స్వయంగా తానే ఆ మంత్రాన్ని పఠించి వాయిస్ మెసేజ్‌ను షేర్ చేశారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa