ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్శిటీలో కాల్పులు జరిగాయి. సీఏఏకు వ్యతిరేకంగా విద్యార్దులు ర్యాలీ నిర్వహిస్తుండగా ఒక్క సారిగా కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఓ విద్యార్ది తీవ్రంగా గాయపడ్డాడు. అతనిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులే కాల్పులు జరిపారని విద్యార్దులు ఆరోపిస్తున్నారు. తాము కాల్పులు జరపలేదని దీని పై విచారణ చేస్తామని ఢిల్లీ పోలీసులు అంటున్నారు. ప్రస్తుతం యూనివర్సిటిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa