ముంబైలో న్యూఇయర్ వేడుకల సందర్భంగా ప్రియుడిని ఇంటికి పిలిచిన ఓ మహిళ.. అతని ప్రైవేట్ భాగాలను కత్తితో కోసింది. 42 ఏళ్ల వ్యక్తి, 25 ఏళ్ల మహిళ మధ్య ఏడేళ్లుగా సంబంధం ఉంది. పెళ్లి కోసం కొంతకాలంగా ఆమె ఒత్తిడి చేస్తున్నది. గురువారం తెల్లవారుజామున పెళ్లి విషయంపై వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆగ్రహించిన ఆ మహిళ కత్తితో ప్రియుడి ప్రైవేట్ భాగాలను కోసింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు కేసు నమోదు చేసి, ఆమె కోసం గాలిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa