ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాశి ఫలాలు (07-06-2020)

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 07, 2020, 12:21 PM

రాశి- మేషం :ఉద్యోగస్తులకు ఒత్తిడులు తగ్గుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల వారికి ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. శుభకార్యాల్లో పాల్గొని బంధువులతో కీలక విషయాలు చర్చిస్తారు. ఖర్చుల విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఖర్చు చేయాలి.


రాశి- వృషభం: పారిశ్రామికవేత్తలు, కళాకారులకు గడ్డుకాలం. మానసికంగా ధృఢంగా ఉంటారు. కీలక వ్యవహారాల్లో అధికారులు, పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది. వారి సహకారం లభిస్తుంది. మీ పనితీరుకు ప్రశంసలు అందుతాయి. ఇంటిలో ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతంగా సాగుతుంది.


రాశి- మిధునం: చిన్ననాటి మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. అధికారులు మీ పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు. తోటి వారికి సహాయం చేయడంలో ఉత్సహం చూపుతారు. బంధువులను కలిసి విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. శత్రువులపై మీరే విజయం సాధిస్తారు. ఆర్ధిక వ్యవహారాల్లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు.


రాశి- కర్కాటకం: వ్యాపారస్తులు ఆశించినంత లాభాలు అందుకోలేరు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. అనవసర ధనవ్యయం జరిగే సూచనలు ఉన్నాయి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. శత్రువుల విషయంలో నిర్లిప్తత పనికి రాదు. అప్రమత్తంగా ఉండాలి.


రాశి- సింహం: వ్యాపారస్తులకు కొత్త పెట్టుబడులకై చేసే ప్రయత్నాలు ఫలించవు. శుభకాలం. ప్రయత్నాలు విజయవంతమవుతాయి. మొదలుపెట్టిన పనులు ఊపందుకుంటాయి. మీ అభివృద్ధికి దోహదపడే ఒక కీలక నిర్ణయం తీసుకుంటారు. మీ పై అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. అనవరస విషయాల్లో తలదూర్చకండి.


రాశి- కన్య: ఆర్థిక పరిస్థితి మరింత క్షిణిస్తుంది. మీ వృత్తి ధర్మాన్ని సమర్ధవంతంగా నిర్వహిస్తారు. శారీరక శ్రమ కాస్త పెరుగుతుంది. తోటి వారి సహకారంతో సాహసోపేతమైన అడుగు వేస్తారు. ఆర్ధిక విషయాలు అనుకూలిస్తాయి. అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో పురోగతి సాధిస్తారు.


రాశి- తుల: వ్యాపారస్తులకు నిరాశజనకంగా ఉంటుంది. సంపూర్ణ విశ్వాసంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. బంధుప్రీతి ఉంది. సందర్భోచితంగా కీలక నిర్ణయాలు తీసుకోండి. కుటుంబ సభ్యుల సూచనలు మేలు చేస్తాయి. గొప్పవారితో సత్సాంగత్యం కలుగుతుంది.


రాశి- వృశ్చికం: రాబడి కొంత తగ్గి అప్పులు చేస్తారు. ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలున్నాయి. అనవసర ప్రసంగాలు వద్దు. అకారణ కలహ సూచన. శారీరక శ్రమ పెరుగుతుంది. కొందరి ప్రవర్తనా శైలి మిమ్మల్ని బాధిస్తుంది. మనోవిచారం కలుగకుండా చూసుకోవాలి. కొత్త నిర్ణయాలు వాయిదా వేసుకోవాలి.


రాశి- ధనస్సు: సినీ రాజకీయ రంగాల వారు నిదానం పాటించాలి. లక్ష్యాలను చేరుకోవాలంటే బాగా కృషి చేయాలి. ఉత్సాహంగా ముందుకు సాగాలి. తలపెట్టిన పనుల్లో ఆటంకాలు తలెత్తకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. శత్రువులకు దూరంగా ఉండాలి.


రాశి-మకరం: పెట్టుబడులు, వృత్తి, వ్యాపారాలు, ప్రయాణాలపై ఈ వారం దృష్టి పెడతారు. మంచి కాలం. మీ మీ రంగాల్లో లాభదాయకమైన ఫలితాలు సొంతమవుతాయి. మనఃసౌఖ్యం ఉంది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు వద్దు.


రాశి- కుంభం: సినీ, రాజకీయ రంగాల వారికి కొంత నిరుత్సాహకరంగా ఉంటుంది. పూర్వ పుణ్యం రక్షిస్తోంది. చేపట్టే పనులు ఆలస్యమవకుండా చూసుకోవాలి. నలుగురికి ఉపయోగపడే పనులను తలపెడతారు. సకారాత్మక ఆలోచనలతో అనుకూల ఫలితాలు సాధిస్తారు.


రాశి- మీనం: ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాల్లో కొంత నిరుత్సాహం ఎదురవుతుంది. ప్రయత్న లోపం లేకుండా చూసుకోవాలి. మానసికంగా చంచల స్వభావాన్ని వీడండి. అనవసర ఖర్చులు ఉంటాయి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యాన్ని దరిచేరనీయకండి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa