ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉధృతి తగ్గట్లేదు. రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయే తప్ప తగ్గే పరిస్థితులు మాత్రం కనిపించట్లేదు. కరోనా నియంత్రణకై ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కేసుల ఉధృతి మాత్రం తగ్గట్లేదు. జూన్ ఫస్ట్ నుంచి కేసుల సంఖ్య పెద్ద ఎత్తున నమోదవుతున్నాయి. ఏపీలో కొత్తగా 199 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ కొత్త కేసులతో కలిపితే రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,718కు చేరుకుంది. ఇవాళ మొత్తం 17,695 శాంపిల్స్‌ను పరీక్షించినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ఇదిలా ఉంటే.. కొత్తగా నమోదైన కేసుల్లో ఏపీకి చెందిన వారు 130 మందికి.. ఇతర ప్రదేశాల నుంచి వచ్చిన 69మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. కాగా కొత్తగా ఇద్దరు కరోనా మృతి చెందారు. కృష్ణా జిల్లాలో ఒకరు, కర్నూలు ఒకరు మృతి చెందారు. ఏపీలో ఇప్పటివరకు కరోనాతో 75మంది మృతి చెందినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఏపీలోని పలు ఆస్పత్రుల్లో ప్రస్తుతం 1,290 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ కరోనాను జయించి 2,353మంది డిశ్చార్జ్ అయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa