ఒక అప్పుల రాజ్యం, రౌడి రాజ్యం రాష్ట్రాన్ని ఏలుతోందని టీడీపీ అర్బన్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వ్యాఖ్యానించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ 82 వేల కోట్లు జగన్ అప్పు చేశారని... ఏపీ ఆర్ధిక పరిస్థితి సున్నా స్థాయికి పడిపోయిందని అన్నారు. చంద్రబాబు, లోకేష్‌పై విజయసాయి రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. విజయసాయి రెడ్డి గబ్బిలంలాగా తిరుగుతున్నాడని ఆయన విమర్శించారు. ప్రజావేధిక కూల్చినప్పటి నుంచి విద్వంసం ప్రారంభమైందని తెలిపారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన వ్యక్తం చేస్తుంటే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. కమ్మ సామాజిక వర్గాన్ని రొహ్యంగాలుగా చూస్తున్నారన్నారు.
అన్ని కీలక పదవులు రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చారన్నారు. అమరావతిని జగన్ చంపేశారని వ్యాఖ్యానించారు. హైదరాబాదును చంద్రబాబు అభివృద్ధి చేయబట్టే.. కేసీఆర్ కాలుమీద కాలు వేసి కూర్చున్నారన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత లులూ కంపెనీలు లాంటివి ఎన్నో తరిమేశారని తెలిపారు. టీడీపీ పథకాలకే కొత్త పేర్లు పెడుతున్నారన్నారు. బీసీ, ఎస్సీ, కాపు, మైనార్టీల నిధులను అమ్మ ఒడి మళ్లించారని ఆరోపించారు. ఏపీని జగన్ వెనిజులా తయారు చేస్తున్నారని వాసుపల్లి గణేష్‌కుమార్ విమర్శలు గుప్పించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa