ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగనన్న 'చేదోడు' ప్రారంభం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 10, 2020, 12:21 PM

 జగనన్న చేదోడు పథకాన్ని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఆయన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కంప్యూటర్‌ బటన్‌ నొక్కి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో రూ.10,000 చొప్పున నగదు జమ చేశారు. అనంతరం సిఎం మాట్లాడుతూ.. ఈ పథకం ద్వారా మొత్తం 2.47 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.247.04 కోట్లు జమ చేయనున్నామన్నారు. 'జగనన్న చేదోడు' ద్వారా నాయీ బ్రాహ్మణులు, రజకులు, టైలర్లకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందుతుందని చెప్పారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఈ పథకం అములు చేస్తున్నామని చెప్పారు. అర్హతలు ఎన్నవారు ఇంకా ఎవరైనా ఉంటే దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. రాజకీయ పార్టీలకతీతంగా గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా లబ్ధిదారులనుపారదర్శకంగా ఎంపిక చేసి ప్రభుత్వం సహాయం అందిస్తోందని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa