ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ మంత్రివర్గ సమావేశం ప్రారంభం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 11, 2020, 12:14 PM

రాష్ట్రంలోని కీలకమైన అంశాలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి‌ అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. భౌతిక దూరం‌ కోసం వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఈ భేటీ జరుగుతోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళల వైఎస్‌ఆర్ చేయూత పథకంపై సమావేశంలో చర్చించనున్నారు. చిరువ్యాపారుల ప్రభుత్వ సహాయం పథకం ప్రధానంగా సమావేశంలో చర్చకు రానుంది. వీటితో పాటు మూడు సవరణ బిల్లుల ముసాయిదాలపై కేబినెట్‌ చర్చించే అవకాశం ఉంది. పర్యావరణ, జీఎస్టీ, ఉన్నత విద్యా కమిషన్ సవరణ బిల్లులపై చర్చించనున్నారు. ఇక అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణ, కురుపాం ఇంజినీరింగ్ కాలేజీ, 3 నర్సింగ్ కాలేజీలకు మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. వైద్య, ఆరోగ్య శాఖలో భారీగా పోస్టుల భర్తీపైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa