ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిచ్చెన ఎక్కిన చిరుత పులి..వీడియో వైరల్!

national |  Suryaa Desk  | Published : Thu, Jun 11, 2020, 02:15 PM

గుజరాత్‌లోని చొటా ఉదేపూర్ జిల్లా రున్వాడ్ గ్రామంలోని బావిలో ఓ చిరుత పులి నూతిలో పడింది. అయితే, ఆ నూతిలో ఉన్న మెట్ల మీదకు ఎక్కి ప్రాణాలను దక్కించుకుంది. బావి నుంచి గాండ్రింపులు విన్న గ్రామస్తులు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. అటవీ సిబ్బంది పులిని బయటకు తీసేందుకు ప్రయత్నించారు. ఒక నిచ్చెనను బావిలోకి దింపారు. దీంతో చిరుత దానిపైకి దూకి బయటకు వచ్చేందుకు ప్రయత్నించింది. రెండు మూడు సార్లు నిచ్చెన మీద నుంచి పైకి వచ్చేందుకు ప్రయత్నించి విఫలమైనా ఎట్టకేలకు సాధించింది. అనంతరం ఆ పులి అడవిలోకి వెళ్లిపోయింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa