అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించిన బిల్లును రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదముద్ర వేసింది. మూడు రాజధానుల ఏర్పాటు శాసనప్రక్రియ దశలో ఉందని అంతకుముందు ఏపీ గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. వాస్తవానికి గత అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ బిల్లును ఆమోదించారు. ఐతే మండలిలో దీనికి బ్రేకులు పడ్డాయి. మండలి ఛైర్మన్ తన విచక్షణాధికారాన్ని ఉపయోగించి ఎలాంటి చర్చ లేకుండానే బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించారు. అప్పటి నుంచి పెండింగ్‌లో ఉన్న బిల్లును ఇప్పుడు అసెంబ్లీ మరోసారి ఆమోదించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa