లక్నో : సరిహద్దులో ఉద్రికత్తల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ పోలీసులకు తమ స్మార్ట్‌ఫోన్‌లో చైనాకు సంబంధించిన యాప్‌లు వెంటనే తొలగించాలని ఎస్టీఎఫ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆదేశించారు. వారి సన్నిహితులు, కుటుంబ సభ్యుల ఫోన్ లలో కూడా యాప్ లను తొలగించాలని ఆదేశించారు. ఈ యాప్‌ల వినియోగంతో ఫోన్‌లోని డాటా అపహరణకు గురయ్యే అవకాశముందని కేంద్రం హోంశాఖ సూచించిందని పేర్కొన్నారు. ఈ యాప్‌ల జాబితాలో వాల్యూట్ హైడ్, వీ చాట్, యూసీ న్కూస్, క్లబ్ ఫ్యాక్టరీ, హలో, లైక్, క్వై అండ్ రోమీ, టిక్‌టాక్, వీబో, షేరిట్, ఉన్నట్లు వెల్లడించారు. త్వరలో చైనా వస్తువులను బహిష్కరించాలంటూ పిలుపు రానుందని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa