రాశి-మేషం
విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీమీ రంగాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఆత్మవిశ్వాసమే శ్వాసగా ముందుకు సాగితే విజయం వరిస్తుంది. కీలక విషయాల్లో పెద్దల సూచనలు పనిచేస్తాయి. ఆధ్యాత్మిక క్షేత్ర సందర్శన చేస్తారు. ఎక్కువ సమయం ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. వివాదాలకు దూరంగా ఉండండి.
రాశి-వృషభం
ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఆలోచన పరిధి పెరుగుతోంది. బంధు మిత్రులను కలుస్తారు. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. చేపట్టిన ప్రయాణాలు మధ్యలో ఆపాల్సి రావడం గానీ, ఏదైనా అడ్డంకి ఎదురవడం గానీ జరగవచ్చు. దుష్టులకు దూరంగా ఉండండి. ఇతరులతో వ్యవహరించేటప్పుడు కొంత జాగ్రత్త అవసరం.
రాశి- మిధునం
నూతన వస్తువులు కొంటారు. మనసుపెట్టి పనిచేస్తే అనుకూల ఫలితాలు వస్తాయి. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. మీ పిల్లలతో, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అనుకూలం. బంధుమిత్రులను కలుస్తారు. ముఖ్య విషయంలో అనుకూల ఫలితం వస్తుంది.
రాశి- కర్కాటకం
ఇబ్బందికర సంఘటనలు ఉన్నాయి. ఈ రోజు శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం కుదుట పడుతుంది. ప్రయాణాల్లో ఆటకం ఏర్పడుతుంది. చేయని తప్పుకు నిందపడాల్సి వస్తుంది. మీ గృహానికి సంబంధించి కొనుగోలు వ్యవహారాలు లేదా ఇతర లావాదేవీలు ఒక కొలిక్కి వస్తాయి. కోర్టు కేసులు, వివాదాలు పరిష్కరించబడతాయి. వివాదాలు దూరంగా ఉండటం మంచిది.
రాశి-సింహం
అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. కష్టాన్ని నమ్ముకుని ముందుకు సాగితే అనుకున్న ఫలితాలు వస్తాయి. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. మానసికంగా కొంత ఆందోళనగా ఉంటుంది. మాట పట్టింపుకు పోకూడదు. ఆహార విషయం, ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వ్యాపార లావాదేవీలకు అనుకూల దినం కాదు. తోటివారితో సంతోషాన్ని పంచుకుంటారు.
రాశి-కన్య
సమయానికి ఆహారనియమాలను పాటించాలి. మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. బంధువులతో ప్రేమగా వ్యవహరించాలి. ఇంటికి సంబంధించిన విషయాలకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. అపకీర్తి కలిగించేవారు ఎదురవుతారు. వాహన కొనుగోలు లేదా భూ సంబంధ వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. శిత్తశుద్ధితో పనిచేసి విజయాలను సొంతం చేసుకుతుంటారు. ప్రశాంత చిత్తంతో ఉంటేనే అన్ని పనులు జరుగుతాయి.
రాశి-తుల
ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఏకాగ్రతతో పనిచేసి ఫలితాలు అందుకుంటారు. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా ట్రాన్స్ఫర్ కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ రోజు ముఖ్యసమాచారం అందుతుంది. శారీకశ్రమ అధికమవుతుంది. తోటివారి సహాయం అందుతుంది. మిత్రులను లేదా బంధువులను కలుస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.
రాశి- వృశ్చికం
పనుల్లో జాప్యం. సకాలంలో పనులను పూర్తిచేసుకోవాలి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేసే అవకాశముంటుంది. ఆహార విషయంలో జాగ్రత్త అవసరం. దూర ప్రయాణాల విషయంలో అనుకూలం. పెట్టుబడులకు అనుకూల దినం కాదు. కలహాలకు తావివ్వరాదు.
రాశి-ధనస్సు
ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. మధ్యమ ఫలితాలు ఉన్నాయి. ఆర్థికంగా ఈ రోజు అనుకూలిస్తుంది. మొండి బకాయిలు వసూలవుతాయి. కొత్త వస్తువులను కొనుగోలుచేస్తారు. ఆర్థికాభివృద్ధిలో మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. తోటివారితో సరదాగా గడుపుతారు. కీలక చర్చలు ఫలిస్తాయి. అనవసర ఖర్చులుంటాయి.
రాశి-మకరం
ఎంతటి పనినైనా అవలీలగా పూర్తి చేస్తారు. అనుకున్న పనులు నెరవేరుతాయి. బద్ధకానికి, అసూయకు చోటివ్వకండి. మీ ప్రవర్తన కారణంగా సమస్యలు వచ్చే అవకాశముంటుంది. తీసుకునే నిర్ణయాల విషయంలో జాగ్రత్త అవసరం. అనారోగ్యం నిలకడగా ఉంటుంది. కుటుంబసభ్యుల ఆదరణ ఉంటుంది. కొత్త స్నేహాలు, పరిచయాలు ఏర్పడతాయి. ప్రేమ వ్యవహారాలు కొలిక్కి వస్తాయి.
రాశి-కుంభం
ముఖ్యమైన పనులు సకాలంలో చక్కదిద్దుతారు. ఈ రోజు పనులను పూర్తిచేస్తారు. విజయానికి మిత్రుల సహకారం లభిస్తుంది. మీరు ఈ రోజు ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యం బాగుంటుంది, మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. వినోదకార్యక్రమాల్లో మునిగితేలుతారు. అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది.
రాశి-మీనం
దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. పట్టుదలతో అనుకున్న పనిని సాధిస్తారు. తెలివిగా అలోచించి విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. మీరు ఏదైనా కొత్త పని ప్రారంభించాలనుకుంటే దానికి ఈ రోజు చాలా అనుకూలమైనది. ఉద్యోగంలో ప్రగతి సాధిస్తారు. ఆటంకాలు తొలగి పోతాయి. వ్యాపార లావాదేవీల్లో అనుకున్న ప్రగతి సాధిస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa