ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ సేవింగ్ డేస్ సేల్స్ జూన్ 23 నుంచి జూన్ 27 వరకు ఉండనుంది. ఫ్లిప్ కార్ట్ ఎప్పటిలాగే ఈ సారి సైతం స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్లను ప్రకటించింది. ఏ స్మార్ట్‌ఫోన్లపై ఎలాంటి ఆఫర్లు ఉన్నాయో తెలుసుకుందాం.
1. రెడ్‌మీ కే20 ప్రో స్మార్ట్‌ఫోన్ 6జీబీ+128జీబీ ధర రూ.26,999 కాగా హెచ్‌డీఎఫ్‌సీ డిస్కౌంట్‌తో రూ.23,499 ధరకే ఈ ఫోను ను మీరు కొనుగోలు చేయవచ్చు
2. వివో జెడ్1 ఎక్స్ స్మార్ట్‌ఫోన్ 6జీబీ+64జీబీ ధర రూ.16,990 కాగా ఆఫర్ తో రూ.14,990కే మీరు పొందవచ్చు.
3. రియల్‌మీ ఎక్స్2 ప్రో స్మార్ట్‌ఫోన్ 8జీబీ+128జీబీ వేరియంట్ అసలు ధర రూ.31,999 కాగా రూ.4,000 ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్‌తో రూ.27,999కే కొనొచ్చు.
4. ఎంఐ మిక్స్ 2 స్మార్ట్‌ఫోన్ 6జీబీ+128జీబీ ధర రూ.19,999 కాగా ఆఫర్ లో రూ.14,999 కే మీరు పొందవచ్చు.
5. వివో నెక్స్ స్మార్ట్‌ఫోన్ 8జీబీ+128జీబీ ధర రూ.29,990 కాగా ఆఫర్లో రూ.23990కే పొందవచ్చు.
6. ఒప్పో రెనో 10ఎక్స్ జూమ్ 6జీబీ+128జీబీ ధర రూ.38,990 కాగా ఆఫర్లో రూ.26,990 కే లభించనుంది.
7. యాపిల్ ఐఫోన్ 8 స్మార్ట్‌ఫోన్ 64జీబీ ధర రూ.38,999 కాగా ఆఫర్లో రూ.36,999 కే పొందవచ్చు.
8. యాపిల్ ఐఫోన్ 7 స్మార్ట్‌ఫోన్ 32జీబీ వేరియంట్ అసలు ధర రూ.29,499 కాగా ఆఫర్లో రూ.28,499కే పొందవచ్చు.
9. యాపిల్ ఐఫోన్ ఎక్స్ఎస్ స్మార్ట్‌ఫోన్ 64జీబీ ధర రూ.62,999 కాగా ఆఫర్లో రూ.58,999కే లభించనుంది.
10. మోటోరోలా వన్ ఫ్యూజన్+ 6జీబీ+128జీబీ మొబైల్ ధర రూ.16,999. ఈ ఫోన్ ఫ్లాష్ సేల్‌లో అందుబాటులో ఉండనుంది.
11టెక్నో స్పార్ట్ పవర్ 2 స్మార్ట్‌ఫోన్ 6జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.9,999. ఈ ఫోన్ ఫ్లాష్ సేల్‌లో అందుబాటులో ఉంటుంది. అన్ని ఫోన్లపై హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కస్టమర్లకు 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఉంది. కస్టమర్లకు నో కాస్ట్ ఈఎంఐ, ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్స్ లాంటి ఆఫర్స్ ఉన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa