అమరావతి : నైరుతీ రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా శనివారం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురువనున్నాయి. ఈనెల21న రాయలసీమ ప్రాంతంలోను, 22,23తేదీల్లో ఉత్తరాంధ్ర, యానాం ప్రాం తాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. శుక్రవారం ఓర్వకల్లు, మంత్రాలయం, చింతలపూడి, కాకినాడ, ముంచంగిపుట్టు, నాయుడుపేట, కందుకూరు తదితర ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి. కాగా చిత్తూరు జిల్లాలో రుతుపవనాల ప్రభావం తక్కువగా ఉండగా, రాయలసీమ లోని మిగిలిన మూడు జిల్లాల్లో సాధారణంగానే ఉందని వాతావరణశాఖ అధికారులు చెప్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa