హైదరాబాద్ : ప్రచారం నిమిత్తం నగరానికి చేరుకున్న ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌తో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు భేటీ అయ్యారు. బంజారాహిల్స్ రోడ్ నం.1 పార్క్ హయత్ హోటల్‌లో జరిగిన ఈ సమావేశంలో ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
వైఎస్ జగన్ ఈ సందర్భంగా రామ్‌నాథ్ కోవింద్‌కు శాలువా కప్పి సత్కరించారు. అనంతరం పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలను
కోవింద్‌కు పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, బీజేపీ నేత మురళీధరరావు తదితరులు పాల్గొన్నారు. కాగా రాష్ట్రపతి ఎన్నికల్లో తమ పార్టీ రామ్‌నాథ్ కోవింద్‌కు పూర్తి మద్దతు ఇస్తుందని వైఎస్ జగన్ ఇప్పటికే ప్రకటించిన విషయం విదితమే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa