ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మళ్లీ జెస్సీగా త్రిష

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 05, 2017, 09:24 AM

చెన్నై: గౌతంమేనన్‌ దర్శకత్వంలోని ‘వినైతాండి వరువాయా’ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ చిత్రంలో త్రిష పాత్రకు ఎనలేని గుర్తింపు లభించింది. ఇప్పుడు ఓ మలయాళ చిత్రంలో జెస్సీ తరహా పాత్రను పోషిస్తున్నారట త్రిష. ‘హేజ్‌ జూట్‌’ అనే ఈ సినిమాలో నివిన్‌పాలికి జోడీగా నటిస్తున్నారు. క్రైస్తవ అమ్మాయి పాత్రలో కనిపించనున్నారు ఈమె. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది. తమిళంలో కూడా విడుదల చేయనున్నారు. ఈ సినిమా గురించి త్రిష మాట్లాడుతూ ఇది ప్రేమకథా చిత్రం. రొమాన్స్‌కు ఏ మాత్రం కొదవ ఉండదు. నన్ను మళ్లీ జెస్సీగా చూడొచ్చు. ‘వినైతాండి వరువాయా’ తర్వాత అంతటి ప్రత్యేకత కలిగిన సినిమా ఇది. నాలోని పూర్తి స్థాయి నటనను ఈ సినిమాలో చూడొచ్చు అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa