ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆస్ట్రేలియా ఓపెన్ నుంచి సుమిత్‌ ఔట్‌

international |  Suryaa Desk  | Published : Tue, Feb 09, 2021, 12:40 PM

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియా ఓపెన్‌ 2021 నుంచి భారత టెన్నిస్‌ స్టార్‌ సుమిత్‌ నగల్‌ నిష్క్రమించాడు. పురుషుల సింగిల్స్‌ విభాగంలో తొలి రౌండ్‌లో లిథూనియా ఆటగాడు ఆర్‌ బెకరిస్‌ చేతిలో ఓటమిపాలయ్యాడు. దీంతో ఈ టోర్నీ నుంచి సుమిత్‌ వైదొలిగాడు. రెండు గంటలకు పైగా సాగిన ఈ మ్యాచ్‌లో ఆది నుంచి ఆధిపత్యం చెలాయించిన బెకరిస్‌ చివరికి ఏ సెట్‌లోనూ సమిత్‌కు అవకాశం ఇవ్వలేదు. భారత స్టార్‌ రెండో సెట్‌లో గట్టి పోటీ ఇచ్చినా చివరికి బెకరిస్‌ ముందు నిలవలేకపోయాడు. ఈ క్రమంలోనే సుమిత్‌ 2-6, 5-7, 3-6 తేడాతో ఓటమిపాలయ్యాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa