ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శృంగార సమస్యలను దూరం చేసే ఫుడ్ ఐటెమ్స్ ఇవే

national |  Suryaa Desk  | Published : Wed, Feb 10, 2021, 05:45 PM

ఈ మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా చాలామంది పురుషులు అంగస్తంభన సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్య అన్ని వయసులవారిలో సర్వసాధారణమైపోయింది. వివిధ ఫ్యాక్టర్స్ ఈ సమస్యకు దారితీస్తున్నాయి. అవేంటంటే, మెడికేషన్, స్మోకింగ్, డ్రగ్స్, అలాగే ఆల్కహాల్ వంటివి పురుషుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి. దురదృష్టవశాత్తు, పరిష్కారం త్వరగా రావాలన్న ఆలోచనలో సరైన మార్గంలో వెళ్లలేకపోయారు. మరిన్ని ఇబ్బందులు కొనితెచ్చుకుంటున్నారు. హోమ్ రెమెడీస్ నుంచి సప్లిమెంట్స్ వరకు ప్రయత్నించి విసిగి పోతున్నారు. వారి పెర్ఫామెన్స్ ను ఇంప్రూవ్ చేసుకోవడానికి అనేక విధాలుగా కష్టపడుతున్నా ఫలితం దక్కట్లేదు. ఈ కండిషన్ అనేది పిల్స్ తో పరిష్కారమవుతున్నా కూడా ఆహారంలో కూడా మార్పులు తీసుకోవడం మంచిది. ప్రత్యేకమైన ఆహారానియమాలను పాటిస్తే హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. అంగస్తంభన సమస్య తగ్గుతుంది.
అంగస్తంభన సమస్య అనేది శృంగార జీవితాన్ని అనుభవించనివ్వదు. ఈ కండిషన్ తో బాధపడుతున్న పురుషుల్లో ఆ డ్రైవ్ హెల్తీగా ఉన్నా కూడా శరీరం మాత్రం సరైన విధంగా రెస్పాండ్ అవదు. చాలా సార్లు, స్ట్రెస్ ఎక్కువవడం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. అప్పుడప్పుడూ అంగస్తంభన సమస్య తలెత్తడం సహజమే, కానీ తరచూ ఈ సమస్య తలెత్తుతూ ఉంటే అనారోగ్య సమస్యగానే పరిగణించాలి. అంతర్లీన అనారోగ్య సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించాలి. డేటా ప్రకారం ప్రతి ఐదుగురిలో ఒకరు ఈ సమస్యతో బాధపడుతున్నారని తెలుస్తోంది. ఈ సంఖ్య వయసు పెరుగుతున్న కొద్దీ పెరుగుతుంది.
మనం తీసుకునే ఆహారం మనకి శక్తిని అందించడంతో పాటు మనల్ని హెల్తీగా ఉంచేందుకు కూడా తోడ్పడుతుంది. అనేకరకాల అనారోగ్య సమస్యల నుంచి రక్షిస్తుంది. లేటెస్ట్ రీసెర్చ్ ప్రకారం మెడిటేరియన్ డైట్ కి దగ్గరలో ఉన్న డైట్ ను తీసుకున్న పురుషుల్లో ఈ అంగస్తంభన సమస్య అనేది ఎక్కువగా లేదని తేలింది. శాన్ ఫ్రాన్సిస్కోలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ స్కాట్ ఆర్ బాయు నేతృత్వంలో జరిగిన ఈ స్టడీలో ఆరోగ్యకరమైన డైట్ అనేది అంగస్తంభన సమస్యలను తగ్గిస్తుందని నిరూపితమైంది.
ఈ స్టడీ కోసం, రీసెర్చర్స్ టీం అంతకు ముందు హార్వర్డ్ యూనివర్సిటీ వారు ఓ సర్వే కోసం కలెక్ట్ చేసిన డేటాను అధ్యయనం చేశారు. ఇది 21000 కంటే ఎక్కువ మంది పురుషుల నుంచి స్వీకరించబడింది. వారి డైట్ క్వాలిటీను ప్రతి నాలుగేళ్లకు 1986 నుంచి 2014 మధ్య పరిశీలించడం జరిగింది. చివరగా తేలిందేంటంటే, మెడిటేరియన్ డైట్ కి దగ్గరగా ఉండే డైట్ ను తీసుకున్న పురుషుల్లో అంగస్తంభన సమస్యలు తలెత్తే రిస్క్ చాలా తక్కువని. అంతేకాక, 60 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న పురుషులు ఎవరైతే హెల్తీ డైట్ ను ఫాలో అయ్యారో వారిలో క్రానిక్ డిసీజెస్ బారిన పడే ప్రమాదం కూడా తగ్గిందట. వారిలో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ సమస్య బారిన పడే ప్రమాదం తక్కువని తేలింది.
మెడిటేరియన్ డైట్ తీసుకుంటే అనేక హెల్త్ బెనిఫిట్స్ పొందవచ్చని హెల్త్ ఎక్స్పర్ట్స్ చెబుతూ ఉంటారు. దీని హెల్త్ బెనిఫిట్స్ వల్ల ఇది 2019లో హేల్తియస్ట్ డైట్ గా కూడా పేరొందింది. గ్రీస్, ఫ్రాన్స్, ఇటలీతో సహా మెడిటేరియన్ సముద్రానికి దగ్గరగా ఉన్న దేశాలలో ప్రజలు తినే సాంప్రదాయ ఆహారాలపై మెడిటేరియన్ ఆహారం ఆధారపడి ఉంటుంది. ఈ డైట్ లో కూరగాయలు, పండ్లు, మూలికలు, కాయలు, బీన్స్, తృణధాన్యాలు మరియు ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa