దేశంలో కరోనా చికిత్సకు ఆక్సిజన్ కొరత అన్ని రాష్ట్రాలను వేధిస్తోంది. ఆక్సిజన్ కొరత లేకుండా చూడాలని ఇప్పటికే పలు రాష్ట్రాలు కేంద్రానికి మొర పెట్టుకుంటున్నాయి. చాలా చోట్ల దారుణ పరిస్థితులు ఉన్నాయి. ప్రాణ వాయువు అందక ఏకంగా ఓ మంత్రి పీఏ మృతి చెందడం పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో కళ్లకు అద్దం పడుతుంది. కర్ణాటక విద్యాశాఖ మంత్రి సురేష్ కుమార్ వ్యక్తిగత కార్యదర్శి రమేష్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ నెల 13న ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడటంతో ఆయనకు వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరత ఏర్పడింది. దీంతో ఆయన ప్రాణాలు కోల్పోయాడు. మంత్రి పీఏకు ఆక్సిజన్ లభించలేదు అంటే ఇక తమ లాంటి సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు ప్రజలు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa