నేర నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా అనంతపురం జిల్లా వ్యాప్తంగా పోలీస్ అధికారులు రౌడీషీటర్లు, చెడు నడత కల్గిన వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ శ్రీ పి. జగదీష్ IPS గారి ఆదేశాల మేరకు సి. ఐ లు, ఎస్సైలు ఈ కౌన్సిలింగ్ ను చేపట్టారు. నేరాలకు దూరంగా ఉండి, సత్ప్రవర్తనతో జీవించాలని, అసాంఘిక కార్యక్రమాలలో పాల్గొంటే చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని, గంజాయి, మత్తుపదార్థాల వినియోగం లేదా రవాణా చేస్తే తీవ్ర చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa