ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడుతున్న ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఐపిఎల్ టోర్నీ నుంచి విరామం తీసుకుంటున్నట్లు సోమవారం ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్‌ల మధ్య ఆదివారం మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగిన విషయం విదితమే. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయాన్ని సాధించింది. మ్యాచ్ అనంతరం అశ్విన్ తన విరామ నిర్ణయాన్ని ప్రకటించారు.
ట్విట్టర్‌లో అశ్విన్ మాట్లాడుతూ... ' నా కుటుంబ సభ్యులు కరోనా వైరస్‌తో పోరాడుతున్నారు. కాబట్టి ఈ కష్టకాలంలో నేను వారికి అండగా ఉండాలనుకుంటున్నాను. అందుకే ఈ ఐపిఎల్ సీజన్‌కు రేపటి నుంచి విరామం పలుకుతున్నాను. ఒకవేళ పరిస్థితులు కుదుటపడితే మళ్లీ ఆడేందుకు తిరిగొస్తా. ధన్యవాదాలు ' అని అశ్విన్ పేర్కొన్నారు.
అశ్విన్ ట్వీట్‌పై అధికారికంగా స్పందించిన ఢిల్లీ క్యాపిటల్స్ ' ఈ ఆపద సమయంలో అశ్విన్ కుటుంబానికి మా సహకారం ఉంటుంది. మీ కుటుంబ సభ్యులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాం' అని ట్వీట్ చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa