కృష్ణా జిల్లా కంకిపాడు మండలానికి చెందిన వైసీపీ నేత పర్వతనేని వెంకట కృష్ణారావు అనారోగ్యంతో సోమవారం ఉదయం మరణించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కరోనా వ్యాధితో బాధ పడుతున్నటువంటి పర్వతనేని వెంకటకృష్ణరావు దంపతులు గత పది రోజులుగా విజయవాడలోని ఓ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. అయితే వెంకట కృష్ణారావు సతీమణి కరోనా వ్యాధి నుంచి సురక్షితంగా బయటపడినప్పటికీ ఆయన మాత్రం కరోనా నుంచి రికవరీ కాలేక మరణించినట్లు వైసీపీ శ్రేణులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa