ఏపీలో ఈ నెల 16న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరిగే చోట సా.5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అయితే తూర్పు గోదావరి జిల్లాలోని 14 ఎంపీటీసీ స్థానాల్లో మాత్రం మ.2 గంటల వరకే పోలింగ్ నిర్వహించనున్నారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతంలో శాంతిభద్రతల అంశానికి సంబంధించి జిల్లా కలెక్టర్ నుంచి ఎస్ఈసీకి నివేదిక అందింది. ఈ మేరకు ఆ జిల్లాలో ఏటపాక మండలంలోని 12 ఎంపీటీసీ స్థానాలతో పాటు వీఆర్ పురంలోని చినమట్టపల్లి ఎంపీటీసీ, మారేడుమిల్లి మండలంలోని దొరచింతలవాని పాలెం ఎంపీటీసీ పోలింగ్ మ.2 గంటల వరకే కొనసాగుతుందని ఎస్ఈసీ నీలం సాహ్ని ఆదేశాలు జారీ చేశారు.