విశాఖపట్నం: పారిశ్రామిక ప్రాంతం షిప్ బిల్డింగ్ సెంటర్(ఎస్ బీసీ)లో ఇంజినీర్ గా పని చేస్తున్న యువకుడు మంగళవారం ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై మల్కాపురం పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ వివరాలు ఇలా వున్నాయి. కాకరలోవ నివాసం ఉంటున్న టేకుమూడి బాలకృష్ణ కుమారుడు టి. మోహన్ కుమార్(28) డాక్ యార్డు సమీప ఎస్ బీసీలో ఎలక్ట్రికల్ఇంజినీర్ గా పని చేస్తున్నారు. మంగళవారం విధులకు వెళ్లకుండా ఇంటి వద్దేఉన్న కుమారుడు మధ్యాహ్నం 2 గంటల సమయంలో డాబా పై ఉన్న గదిలో ఉరేసుకుని చనిపోయి ఉండడాన్ని తల్లిదండ్రులు గుర్తించి లబోదిబోమన్నారు. తండ్రిబాలకృష్ణ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ కె. దుర్గాప్రసాద్ పర్యవేక్షణలో దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa