ఉత్తరాఖండ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ధన్‌సింగ్ రావత్ గాయపడ్డారు. మంగళవారం సాయంత్రం మంత్రి తాలిసైన్ నుండి డెహ్రాడూన్‌కు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఆయన ప్రయాణిస్తున్న కారు బోల్తా పడింది. మంత్రికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే మంత్రిని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ మంత్రి ధన్‌సింగ్‌కు ఫోన్ చేసి ప్రమాదంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa