ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం కబడ్డీ ఆడుతూ కిందపడిపోయారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో గురువారం క్రికెట్, కబడ్డీ టోర్నమెంట్ లను ఆయన ప్రారంభించారు. ఆటగాళ్లలో ఉత్సాహం నింపేందుకు ఆయన కబడ్డీ ఆడారు. ఈ క్రమంలో కాలు జారి ఆయన కింద పడిపోయారు. సీతారాం కిందపడగానే సిబ్బందితో పాటు ప్లేయర్లు ఆయనని వెంటనే పైకి లేపారు. ఈ ఘటనలో ఆయనకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa