పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం 11 గంటలకు న్యూఢిల్లీలో అఖిలపక్ష భేటీ జరగనుంది. ఈ సమావేశానికి లోక్‌సభ, రాజ్యసభల్లోని వివిధ పార్టీల ఫ్లోర్ లీడర్లు హాజరు కానున్నారు. ఈ ఏడాది పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రెండు దశల్లో జరగనున్నాయి. జనవరి 28న తొలి దశ ప్రారంభమై ఫిబ్రవరి 13 వరకు, రెండో విడత మార్చి 9 నుంచి ఏప్రిల్ 2 వరకు కొనసాగుతాయి. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa