అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, యెమెన్ తిరుగుబాటుదారులైన హుతీలు ఎర్ర సముద్రంలోకి వచ్చే నౌకలపై మళ్లీ దాడులు ప్రారంభిస్తామని హెచ్చరించారు. అమెరికా యుద్ధ విమాన వాహక నౌక 'యూ.ఎస్.ఎస్ అబ్రహం లింకన్' పశ్చిమాసియాకు చేరుకున్న నేపథ్యంలో, హుతీలు ఓ వీడియో విడుదల చేసి, మంటల్లో ఉన్న నౌకను చూపించి 'త్వరలో' అని వ్యాఖ్యానించారు. గాజా యుద్ధం సమయంలో హమాస్‌కు మద్దతుగా హుతీలు ఎర్ర సముద్రంలో వందకుపైగా వాణిజ్య నౌకలపై దాడులు చేశారు. ప్రస్తుతం ఇరాన్-అమెరికా మధ్య యుద్ధం మొదలైతే వీరి ఎంట్రీపై ఆందోళనలు నెలకొన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa