విదేశీ టూరిస్ట్ సహా ఇద్దరు మహిళలపై సామూహిక అత్యాచారం, ఓ పర్యాటకుడి హత్య కేసులో కర్ణాటక సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో ముగ్గురు నిందితులను దోషులుగా నిర్దారించిన న్యాయస్థానం.. వారికి మరణ శిక్ష విధించింది. కొప్పాల్ జిల్లాలోని హంపీ సమీపంలోని సనాపుర వద్ద 2025 మార్చి 6న ఇజ్రాయెల్ పర్యాటకురాలు, హోమ్ స్టేట్ ఆపరేటర్‌పై దుండుగులు సామూహిత్య అత్యాచారానికి పాల్పడ్డారు. అలాగే, వారి అరాచకాన్ని అడ్డుకోడానికి ప్రయత్నించిన ఒడిశాకు చెందిన పౌరుడ్ని కాల్పలో తోసి ప్రాణాలు తీశారు.
వివరాల్లోకి వెళ్తే.. హంపీ సమీపంలోని సనపుర వద్ద తుంగభద్ర ఎడమ కాలువ వద్ద మార్చి 6న రాత్రి ఇజ్రాయెల్ టూరిస్ట్, హోమ్‌స్టే ఆపరేటర్, మరో ముగ్గురితో కలిసి ఉండగా. .దుండగులు మల్లేష్ అలియాస్ హండిమల్లా, సాయి అలియాస్ చైతన్య సాయి, శరణప్పలు వెంబడించి డబ్బులు డిమాండ్ చేశారు. వాళ్లు ఇవ్వకపోవడంతో మగ్గురు టూరిస్ట్‌లను కాల్వలో తోసేసి, ఇద్దరు మహిళలపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం వారి వద్ద ఉన్న డబ్బు, విలువైన వస్తువులను దోచుకెళ్లారు. కాలువలో పడిపోయిన ఇద్దరు డానియల్ (అమెరికా), పంకజ్ (మహారాష్ట్ర) ఈదుకుంటూ సురక్షితంగా బయటపడగా.. ఒడిశాకు చెందిన యువకుడు బిభాష్ కుమార్ నాయక్ నీటిలో ముగినిపోయాడు. మర్నాడు ఉదయం నాయక్ శవం మల్లాపూర్‌లోని పవర్‌హౌస్ గేట్ సమీపంలో గుర్తించారు.
దేశవ్యాప్తంగా ఈ ఘటన దిగ్శ్రాంతికి గురిచేయగా.. ముక్త కంఠంతో ఖండించారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టిన కర్ణాటక పోలీసులు.. ఆరు బృందాలను ఏర్పాటుచేశారు. తీవ్రంగా గాలించిన 40 గంటల తర్వాతమల్లేష్, సాయిలను గంగావతిలో, శరణప్పను వారం తర్వాత తమిళనాడులో అరెస్ట్ చేసి, ఆధారాలతో సహా కోర్టులో నిరూపించారు. దీంతో గంగావతి జిల్లా అండ్ సెషన్స్ కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. ముగ్గురు నిందితులను దోషులుగా నిర్దారించి, వారికి గరిష్ఠ శిక్ష విధించింది. ముగ్గురికి మరణ శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. న్యాయమూర్తి మాట్లాడుతూ.. ఈ నేరం అత్యంత అరుదైన కేసు కిందకు వస్తుందని, అందుకే హంతకులకు గరిష్ట శిక్ష విధించామని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa