ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఢిల్లీలో ఉప్పెన సినిమా సీన్ రిపీట్

national |  Suryaa Desk  | Published : Sat, Dec 25, 2021, 12:15 PM

ఢిల్లీలో ఉప్పెన సినిమా సీన్ రిపీట్ అయింది. ప్రేమించాడనే కారణంతో అమ్మాయి కుటుంబ సభ్యులు అబ్బాయి మర్మాంగాన్ని కోసేశారు. ఈ దారుణ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఢిల్లీకి చెందిన ఓ యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. వీరి పెళ్లికి యువతి కుటుంబ సభ్యులు నిరాకరించడంతో పారిపోయి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత డిసెంబర్ 22న ఢిల్లీకి చేరుకున్నారు. తమకు రక్షణ కల్పించాలని రాజౌరీ పోలీసులను ఆశ్రయించారు. స్టేషన్ నుండి బయటకు వస్తున్న సమయంలో యువకుడిని కిడ్నాప్ చేసిన యువతి కుటుంబ సభ్యులు తీవ్రంగా దాడి చేసి గాయపరిచారు. ఆ తర్వాత అతడి మర్మాంగాన్ని కోసేశారు. ప్రస్తుతం ఆ యువకుడికి సఫ్దర్ జంగ్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa