రైల్వేశాఖ తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభవార్త అందించింది. హైదరాబాద్ నుండి ఏపీ, తమిళనాడు మీదుగా తిరువనంతపురం వరకు అమృత్ భారత్ ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైలును ప్రవేశపెట్టింది. జనవరి 23వ తేదీ నుంచి ఈ రైలు అందుబాటులోకి రానుంది. దక్షిణ మధ్య రైల్వే ప్రకటించిన ఈ రైలులో 8 స్లీపర్ కోచ్లు, 11 జనరల్ కోచ్లు, ఒక ప్యాంట్రీ కార్, రెండు సెకండ్ క్లాస్ కోచ్లు ఉంటాయి. ఈ రైలుకు ముందు, వెనుక ఇంజిన్లు ఉండటంతో వేగంగా, కుదుపులు లేని ప్రయాణం సాధ్యమవుతుంది. తిరువనంతపురం, ఎర్నాకుళం, పాలక్కాడ్, కొట్టాయం, కొల్లం, కాట్పాడి, సేలం, ఈ రోడ్ మీదుగా ఏపీకి, రేణిగుంట, నెల్లూరు, ఒంగోలు, బాపట్ల, తెనాలి, గుంటూరు, సత్తెనపల్లి, మిర్యాలగూడ, నల్లగొండ మీదుగా చర్లపల్లికి చేరుకుంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa