తనపై రెక్కీ నిర్వహించారని వంగవీటి రాధా చేసిన వ్యాఖ్యలతో బెజవాడ రాజకీయం మళ్లీ వేడెక్కింది. ప్రభుత్వం ఇచ్చిన గన్ మెన్లను రాధా తిరస్కరించడంతో ఈ అంశం కీలక మలుపు తిరిగింది. ప్రజలతో ఉండే మనిషిని కాబట్టి తనకు సెక్యూరిటీ అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రాధాకు టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్ చేశారు. రెక్కీ నిర్వహించిన వ్యవహారంపై ఆరా తీశారు. గన్ మెన్లను తిర్కరించడం సరికాదని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పార్టీ అండగా ఉంటుందని అన్నారు. దీనిపై నిష్పక్షపాతంగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa