దేశంలోని డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్ల వంటి గిగ్ వర్కర్లు, డొమెస్టిక్ హెల్పర్లకు ఆర్థికంగా చేయూతనివ్వడం కోసం కేంద్ర ప్రభుత్వం ఓ కొత్త పథకాన్ని తీసుకురాబోతోంది. PM-SVANidhi తరహాలో తీసుకొచ్చే ఈ పథకం ద్వారా ఎటువంటి పూచీకత్తు లేకుండా ఒక్కొక్కరికి రూ.10 వేల రుణం అందించనుంది. ఏప్రిల్ 2026 నుంచి ఈ పథకాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. ఈ-శ్రమ్ పోర్టల్లో నమోదై యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) ఉన్నవారు ఈ పథకానికి అర్హులు. సకాలంలో చెల్లిస్తే రూ.50,000 వరకు మళ్లీ లోన్ పొందే అవకాశం ఉంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa