వాట్సాప్ వినియోగదారులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ ఫీచర్ త్వరలో వాట్సాప్ వెబ్‌లో అందుబాటులోకి రానుంది. ఇప్పటివరకు ఈ సౌకర్యం విండోస్ యాప్ లేదా స్మార్ట్‌ఫోన్‌లకు మాత్రమే పరిమితమై ఉండగా, ఇకపై వెబ్ బ్రౌజర్ నుంచే కాల్స్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉంది. ఈ కొత్త ఫీచర్ అమల్లోకి వస్తే, విండోస్ యాప్ అవసరం లేకుండానే నేరుగా వాట్సాప్ వెబ్ నుంచే గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ చేయగలుగుతారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa