మంత్రాలయం, పెద్దకడుబూరు మండలాల్లో పశుపోషక రైతులకు వైద్య సేవలు సులభతరం చేసేందుకు 1962 ఉచిత పశు అంబులెన్స్ సేవలను ఫిక్స్డ్ షెడ్యూల్ విధానంలో ప్రారంభించారు. సోమవారం మంత్రాలయం టీడీపీ ఇన్చార్జ్ ఎన్. రాఘవేంద్ర రెడ్డి నివాస ప్రాంగణంలో ప్రత్యేక పూజలతో ఈ సేవలను ప్రారంభించారు. రైతులకు ఈ సేవలు ఎంతో ఉపయోగకరమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏడీలు వెంకటసుబ్బయ్య, రాములు నాయక్, డా. సంతోష్, అంబులెన్స్ డాక్టర్లు సుమ, జయలక్ష్మి, డ్రైవర్ నిజాం, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, పశుపోషక రైతులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa