పోర్చుగల్‌లో నేడు 2026 అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సారికి అత్యధికంగా 11 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు, ఇది రికార్డు స్థాయి.దేశవ్యాప్తంగా దాదాపు 11 మిలియన్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించనున్నారు. పోలింగ్ ముగిసిన వెంటనే ఫలితాలు కూడా ఈ రోజే ప్రకటించబడే అవకాశం ఉంది.అయితే, ఏ అభ్యర్థి మొదటి రౌండ్‌లోనే గెలిచే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అధ్యక్ష పదవికి చేరడానికి ఓటర్లలో కనీసం 50 శాతం కంటే ఎక్కువ మద్దతు అవసరం. ఇది సాధ్యంకాకపోతే, అత్యధిక ఓట్లు పొందిన టాప్-2 అభ్యర్థులు ఫిబ్రవరి 8న జరగనున్న రన్‌ఆఫ్‌లో తలపడనున్నారు.ప్రస్తుతం పోర్చుగల్ అధ్యక్షుడిగా Marcelo Rebelo de Sousa గత పది సంవత్సరాలుగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ ఎన్నికల్లో విజేత ఆయన స్థానంలో కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు.గమనించదగ్గ విషయం ఏమిటంటే, ఈ 11 అభ్యర్థుల్లో ఒక్కరే మహిళా. ఇప్పటివరకు పోర్చుగల్‌లో మహిళా అధ్యక్షురాలు ఎవరూ రాలేదని, ఈ ఎన్నిక చరిత్రలో కొత్త అధ్యాయం తీసుకొస్తుందేమో అని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa