ముంబయిలో నూతన సంవత్సర వేడుకలపై.. పోలీసులు ఆంక్షలు విధించారు. ఇవాల్టి నుంచి జనవరి 7 తేదీ వరకూ...... నగరంలో 144 సెక్షన్ విధిస్తున్నట్లు ముంబయి డిప్యూటీ పోలీసు కమిషనర్ ప్రకటించారు. హోటళ్లు...., రెస్టారెంట్లు, పబ్ లు, బార్లు, రిసార్టులు ఈ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలన్న ఆయన.. లేని పక్షంలో వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు. రైళ్లు, బస్సులు, ప్రైవేటు కార్లను ప్రస్తుత నిబంధనలకు అనుగుణంగా.... నడుపుకోవచ్చని స్పష్టం చేశారు. ఒమిక్రాన్ వ్యాప్తి కట్టడికి ఈ నిబంధనలు విధించామన్న ముంబయి పోలీసులు..నగర ప్రజలు వైరస్ నియంత్రణకు సహకరించాలని కోరారు. మరోవైపు బృహత్ ముంబయి కార్పొరేషన్ -BMC సైతం నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa