గత 2020 - 21 అసెస్‌మెంట్ ఇయర్‌కు సంబంధించిన ఇఫైల్డ్ ఐటీఆర్ వెరిఫికేషన్ గడువును 2022 ఫిబ్రవరి 28 వరకు పొడిగిస్తున్నట్లు సీబీడీటీ వెల్లడించింది. సెక్షన్ 139 కింద నిర్ణీత గడువులోగా 2020-21 అసెస్‌మెంట్ ఇయర్‌కు సంబంధించిన అన్ని ఎలక్ట్రానికల్లీ అప్‌లోడెడ్ ఐటీఆర్‌ల (ఇఐటీఆర్) వెరిఫికేషన్ పెండింగ్‌లో ఉంటే (ఐటీఆర్ 5 సమర్పించకపోవడం వల్ల).. వాటి వెరిఫికేషన్ పూర్తి చేసుకోవడానికి సెక్షన్ 119 (2)(ఏ) కింద గడువు పొడిగిస్తున్నామని సీబీడీటీ వివరించింది. ఇలాంటి వారు ఐటీఆర్ 5 ఫిజికల్ కాపీని సంతకం చేసి బెంగళూరులోని సీపీసీకి ఆఫీస్‌కు స్పీడ్ పోస్ట్ ద్వారా పంపాల్సి ఉంటుందని ఒక సర్క్యూలర్‌లో పేర్కొంది. వెరిఫికేషన్ ప్రాసెస్‌ను ఫిబ్రవరి 28లోగా కచ్చితంగా పూర్తి చేసుకోవాలని సూచించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa