ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు ఉత్తరప్రదేశ్‌లో పర్యటించారు. మీరట్ జిల్లాలో స్పోర్ట్స్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేశారు. స్పోర్ట్స్ యూనివర్సిటీకి హాకీ హీరో మేజర్ ధ్యాన్ చంద్ పేరు పెట్టారు. ఈ యూనివర్సిటీలో హాకీ, కబడ్డీ, ఫుట్‌బాల్, టెన్నిస్, వాలీబాల్, హ్యాండ్‌బాల్, బాస్కెట్‌బాల్, జిమ్నాస్టిక్స్, అథ్లెటిక్స్, సైక్లింగ్, స్విమ్మింగ్, వెయిట్ లిఫ్టింగ్, కయాకింగ్, కానోయింగ్, షూటింగ్, ఆర్చరీ మరియు స్క్వాష్‌లలో అధునాతన శిక్షణను అందిస్తుంది. మీరట్ జిల్లాలోని సర్ధానా శివారులో ఈ వర్సిటీని నిర్మిస్తున్నారు. వర్సిటీ నిర్మాణానికి రూ.700 కోట్లు ఖర్చవుతుందని అంచనా.మరోవైపు వర్సిటీ శంకుస్థాపన సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన క్రీడా పరికరాల ప్రదర్శనపై ప్రధాని మోదీ ఆసక్తిని వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa