AP: రాష్ట్రంలో హాస్టళ్ల విద్యార్థులు అనారోగ్యం బారిన పడకుండా నివారణ చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం 9 శాఖల అధికారులతో జిల్లాస్థాయిలో JACలను ఏర్పాటు చేస్తోంది. వైద్య, ఫుడ్ సేఫ్టీ, పంచాయతీ, మున్సిపల్, పశు సంవర్ధక, వ్యవసాయ, సంక్షేమ, గ్రామీణ నీటి పారుదల, విద్యా శాఖల అధికారులతో ఈ కమిటీలు పనిచేస్తాయి. కలెక్టర్లకు ఈ మేరకు ఆదేశాలు జారీ అయ్యాయి. JACల తనిఖీలు కేవలం నివేదికలకే పరిమితం కాకుండా, గుర్తించిన లోపాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని మంత్రి సత్య కుమార్ స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa