ఆరునెలల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్న ఓ యువతి అనుమానాస్పద స్థితిలో విగతజీవిగా కనిపించింది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని ఆనేకల్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జిగణి సమీపంలోని రాజాపురకి చెందిన యశవంత్, బెంగళూరు టీచర్స్‌కాలనీకి చెందిన రాణి (28) ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. యశవంత్ ప్రభుత్వ ఉద్యోగి. అతడికి ఇది రెండవ పెళ్లి. ఈ క్రమంలో బుధవారం రాణి తన భర్త ఇంట్లో ఉరివేసుకున్న స్థితిలో శవమై కనిపించింది. కులాంతర వివాహం కావడంతో భర్త, అత్తమామలే రాణిని చంపి ఉంటారని మృతురాలి కుటుంబసభ్యులు ఆరోపించారు. జిగణి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa