ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుంటూరు నగరంలో ఆకస్మికంగా పర్యటించిన అర్బన్ ఎస్పీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 01, 2022, 11:52 AM

గుంటూరు సిటీలో ఆకస్మికంగా పలు ప్రాంతాల్లో అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ పర్యటించారు. గుంటూరు సిటీలో ఏటి అగ్రహారం, శ్రీనివాసరావుపేట, నెహ్రూనగర్ గెట్, వంటి ప్రాంతాలలో గతంలో ఉన్న పోలీస్ ఔట్ పోస్ట్ లను సోమవారం గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ పరిశీలించారు.


ఎస్పీ వస్తున్నారన్న విషయం తెలియడంతో ఆయా పరిధిలోని సిఐలు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. ఈసందర్భంగా సిఐ, డిఎస్పీ లతో గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ మాట్లాడుతూ, పోలీస్ పోస్ట్ వద్ద సిబ్బందిని నియమించాలని, ఏరియాలలో మరమ్మతులలో ఉన్న సిసి కెమెరాలను బాగు చేయించాలని, అదేశించారు. ఎస్పీ పర్యటనలో వెస్ట్ డిఎస్పీ కె. సుప్రజ, నగరంపాలెం సిఐ హైమారావు, తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa