జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కింద చేపట్టిన ఓటీఎస్ ( వన్టైమ్ సెటిల్మెంట్) కార్యక్రమంలో పురోగతి మరింత మెరుగు పరచాలని, వెంటనే ప్రత్యేక దృష్టి సారించి ఓటీఎస్ ను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి ఆదేశించారు. అనంతపురం కలెక్టరేట్ నుంచి వన్టైమ్ సెటిల్మెంట్, నవరత్నాలు- పేదలందరికీ ఇల్లు, కోవిడ్, ఫీవర్ సర్వే, స్పందన, జగనన్న స్వచ్ఛ సంకల్పం, అర్బన్ హెల్త్ క్లినిక్స్ తదితర అంశాలపై పెనుకొండ సబ్ కలెక్టర్ నవీన్, ఆర్డీవోలు, మండలస్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ విసిలో జాయింట్ కలెక్టర్ ఏ. సిరి, హౌసింగ్ జాయింట్ కలెక్టర్ నిశాంతి, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఓటీఎస్ ( వన్టైమ్ సెటిల్మెంట్)లో భాగంగా జిల్లాలో అర్హులైన లబ్ధిదారులు 5. 08 లక్షల మంది ఉండగా, ఇప్పటివరకు డిజిటల్ అసిస్టెంట్ లు ఆన్లైన్లో డేటా ఎంట్రీ 4. 04 లక్షల మందికి మాత్రమే పూర్తి చేశారని, రెండు రోజుల లోపు మొత్తం డేటా ఎంట్రీ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. డేటా ఎంట్రీ అనంతరం ఎలాంటి పెండింగ్ ఉంచకుండా పంచాయతీ సెక్రెటరీ, విఆర్వో, తహసీల్దార్ లు అప్రూవల్స్ ఇవ్వాలన్నారు. అలాగే డబ్బులు కట్టిన వారికి డాక్యుమెంట్స్ వచ్చిన అనంతరం రిజిస్ట్రేషన్ కూడా పూర్తి చేయాలని, డాక్యుమెంట్స్ కూడా పెండింగ్ ఉంచడానికి వీలు లేదన్నారు. ఓటిఎస్ పై నిరంతరం మానిటర్ చేయాలని, క్షేత్రస్థాయిలో అధికారులంతా మరింత పురోగతి చూపించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కింద ఇళ్ల గ్రౌండింగ్ లో పురోగతి చూపించాలని, గ్రౌండింగ్ పై ప్రత్యేక దృష్టి పెట్టి పూర్తిస్థాయిలో అన్ని ఇల్లు గ్రౌండింగ్ చేయాలన్నారు. బేస్మెంట్ స్థాయిలో ఉన్న ఇళ్ల నిర్మాణాలను వెంటనే బేస్మెంట్ స్థాయికి తీసుకురావాలని ఆమె అధికారులనుఆదేశించారు. ప్రతి వారం నిర్మాణాలు జరిగిన అనంతరం ఎప్పటికప్పుడు ఆన్లైన్లో స్టేజ్ అప్ డేట్ చేయాలన్నారు. ఈ విషయమై సంబంధిత అధికారులు రోజువారీగా మానిటర్ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇందులో భాగంగా ఇళ్ల నిర్మాణాలకు ఇసుక సమస్య లేకుండా చూడాలని, నీటి సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa