రేపల్లె నియోజకవర్గంలో 24 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ జొన్నలగడ్డ యాస్మిన్ తెలిపారు. రేపల్లెలో 15 కేసులు నమోదవ్వగా చెరుకుపల్లి మండలం లో 3 కేసులు , నిజాంపట్నం మండలం లో 4, నగరం మండలం లో 2 కేసులు నమోదైనట్లు ఆమె తెలిపారు. ప్రజలు బయటకు వచ్చేటప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరిస్తూ నిబంధనలు పాటించాలి అన్నారు. ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని డాక్టర్ యాస్మిన్ సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa