మూలధన వ్యయంలో రాష్ట్రాలకు కేటాయింపును రూ.15 వేల కోట్ల నుంచి రూ.లక్ష కోట్లకు పెంచడం స్వాగతించదగిందే అయినా అది రాష్ట్రాలకు పంచేటప్పుడు కేంద్ర అవలంభిస్తున్న విధానం వల్ల ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం జరుగుతోంది. ఈ విధానం వల్ల రూ.లక్ష కోట్లలో ఏపీకి వచ్చేది కేవలం 4.047 శాతమే.కేంద్ర బడ్జెట్ లో 2020-21 లో ద్రవ్య లోటు 9.3 శాతం. 2021-22లో 6.9 శాతం. 2022-23 అంచనా 6.4 శాతం. ఏపీ విషయానికి వస్తే 2020-21 లో ద్రవ్య లోటు 5.38 శాతం. 2021-22లో 3.49 శాతం. ఎఫ్ఆర్బీఎం విషయంలో కేంద్రానికి ఉన్న వెసులుబాటు రాష్ట్రాలకు కల్పించకపోవడం సరికాదు. అని విజయ్ సాయి రెడ్డి తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa