ప్రస్తుతం జరుగుతున్న రాజ్య సభ మీటింగ్స్ లో వైసీపీ ఎంపీ లు రాజధాని గురించి అడగగా, అది రాష్ట్ర ప్రభుత్వ పరిధి లోనిది అని కేంద్రం సమాధానం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఇప్పుడు వెలగపూడి నుంచే పరిపాలన సాగుతోంది. సాంకేతికంగా పాలన ఎక్కడినుంచి జరుగుతుందో అదే ప్రస్తుత రాజధాని అవుతుంది. రాష్ట్ర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా పరిపాలనను వికేంద్రీకరించాలని నిర్ణయించాం. అందులో భాగంగానే మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఆ నిర్ణయం మేరకు భవిష్యత్తులో రాజధాని మార్పు ఉంటుంది. అని ప్రభుత్వ సలహా దారు సజ్జల రామకృష్ణ రెడ్డి తెలియ చేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa